Google lanches AdSense for Telugu websites or Telugu blogs/ తెలుగు వెబ్సైట్లు లేదా తెలుగు బ్లాగులకు గూగుల్ యాడ్సెన్స్ లాంచ్ చేసింది

ఎట్టకేలకు తెలుగు బ్లాగర్స్ కల నిజం అయ్యింది. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ యిటీవల జరిగిన సదస్సులో గూగుల్ ఇండియా తెలుగు బ్లాగర్స్ కు మంచి శుభవార్త తెలిపింది.  
ఇక నుండి  తెలుగు బ్లాగ్స్ మరియు  తెలుగు వెబ్సైట్  కి  గూగుల్ యాడ్సెన్స్ కొరకు అప్లై చేసుకునే అవకాశం 
కల్గించింది.  దీని వలన తెలుగు భాష వెబ్ ప్రచురణ కర్తలకు  మరియు ప్రకటన కర్తలకు ఒక మంచి అవకాశము అని 
అనుకోవాలి ఎందుకంటే తెలుగులో అధిక సంఖ్యలో ఇంటర్నెట్ వినియోగదారులకు ప్రకటనలు చేరుకోడానికి 
వీలుకల్పిష్తుందని గూగుల్ సౌత్ ఈస్ట్ ఆసియా మరియు ఇండియా ఉపాధ్యక్షుడు రాజన్ ఆనందన్  చెప్పారు. 
తెలుగులో వెబ్సైట్స్ మరియు బ్లాగులు నిర్వహించే వారు వెంటనే గూగుల్ యాడ్సెన్స్ కొరకు సైన్ అప్ చేసుకోవాలని మరియు మంచి ఉపయోగకర  ఆసక్తికర  కంటెంట్ రాసి మరియు తెలుగు వ్యాపార ప్రకటనలు ప్రచురించి 
ప్రపంచ వ్యాప్తంగా వున్నా తెలుగు వారిని ఆకర్షించేల చేసి వ్యాపార అభివృద్ధిని చేసుకోవచ్చు  ఈ ప్రయోగం వలన ప్రచురణ కర్తలు ప్రపంచ వ్యాప్తంగా వున్నా వారి వినియోగ దారులతో అనుసంధానించడానికి ఎంత గానో ఉపయోగ 
 పడుతుందని అని వారు అన్నారు. 
గూగుల్ గతం లో భారతీయ భాష హిందీ , బెంగాలీ మరియు తమిళం కూడా ప్రకటనల చేసుకోవడానికి మద్దతు కల్పించింది 
భారత దేశంలో ఇంటర్నెట్ ను ఇంకా ఎక్కువ ఒక బిల్లియన్ ప్రజలకు చేరువ చేయాలనే   ఉద్దేశం తోనే భారతీయ భాషలకు మద్దతు ఇవ్వడం జరిగిందని 
ప్రస్తుతం  234 మిలియన్ల మంది భారతీయ భాషను వాడుతున్న ఇంటర్నెట్ యుసార్లు  2021 నాటికీ 536 మిలియన్ల అవుతారని గూగుల్ (మార్కెటింగ్ సోలుషన్స్ ఇండియా ,గూగుల్ ) డైరెక్టర్  తెలిపారు. 


0 comments:

Post a Comment