Showing posts with label Telangana news. Show all posts
Showing posts with label Telangana news. Show all posts

తెలంగాణ రాష్ట్రము లో గుడిలలో పూజా కార్యక్రమాలు నిర్వహించే పూజారులకు ప్రభుత్వ వేతనాలు

తెలంగాణ రాష్ట్రము లో గుడిలలో పూజా  కార్యక్రమాలు  నిర్వహించే  పూజారులకు ప్రభుత్వ వేతనాలు ఖరారు 
తెలంగాణ రాష్ట్రములోని దేవాదాయ శాఖ పరిధిలో వున్న ప్రతి దేవాలయములో పూజ కార్యక్రమాలు చేస్తున్న అర్చకులకు నేరుగా వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వం నిర్ణయించింది  ఇక నుండి అర్చకులకు
ప్రభుత్వ  ఉద్యోగు ల లాగే నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి వారికి  వేతనాలు చెల్లిస్తామని సి ఎం కే సి ఆర్ గారు ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుండే ఈ విధానము అమల్లోకి వస్తుందని అయన అన్నారు.  అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు సవరించినప్పుడు వారితో పాటు పూజారుల వేతనాలు కూడా సవరిస్తామని తెలియజేశారు.
అంతే కాకుండా పూజారుల పదవి విరమణ వయసును ఇప్పుడున్న 58 ఏండ్లను సవరించి 65 ఏండ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
అర్చకుల జీతాల చెల్లింపులకు సంబందించిన మరియు అర్చకుల పదవి విరమణ వయో పరిమితి పెంపుదలకు సంబందించిన విధి విధానాలు ఖరారు చేసి సోమవారం రోజున అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలనీ ముఖ్యమంత్రి గారు అధికారులను  ఆదేశించడం జరిగింది.
పూర్తి వివరాలకు సోర్స్ చుడండి 

మసీదు లో ప్రార్థన చేసే ఇమామ్ మరియు మౌజం ల కు నెలకు 5000 రూపాయల భృతి

మసీదు లో ప్రార్థన చేసే ఇమామ్ మరియు మౌజం ల కు నెలకు 5000 రూపాయల భృతి ఇవ్వాలని తెలంగాణ సి ఎం శ్రీ కె సి ఆర్ గారు ప్రకటించారు.
దేశంలో ఎ క్కడా లేని విధంగా  మసీదు లో ప్రార్థన చేసే ఇమామ్ మరియు మౌజం ల కు తొలుత నెలకు వెయ్యి రూపాయల భృతిని అందించారు.
తర్వాత  దీనిని 1500 రూపాయలకు పెంచారు ఇప్పుడు మల్లి నెలకు 5000 రూపాయల భృతి ఇవ్వాల్సిందిగా ప్రకటించారు
సెప్టెంబర్ 1 నుండి తెలంగాణ రాష్ట్రం లో ని అన్ని మసీదుల్లో ప్రార్థనలు చేసే  సుమారు 9000 వేళ మంది కి ఈ నిర్ణయం వలన మేలు కల్గుతుందని ముఖ్యమంత్రి గారు అన్నారు. 
మరింత  సమాచారం కొరకు సోర్స్ చుడండి 



Telangana MLC s donated one month salary for Kerala flood victims

34 మంది తెలంగాణ ఎం ఎల్ సి  లు కేరళ వరద బాధితులకు ఒక నెల జీతం విరాళంగా ఇచ్చారు.
ప్రభుత్వ  చీఫ్ విప్ శ్రీ సుధాకర్ రెడ్డి,  ప్రభుత్వ విప్ శ్రీ బి  వెంకటేశ్వర్లు  మరియు ఎం ఎల్ సి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గౌరవ నీయులైన ముఖ్య మంత్రి  గారికి చెక్ ను అంద  చేశారు.
ఇందులో 33 మంది తెరాస ఎం ఎల్ సి లు కాగా ఒక్కరు బి జె పి  ఎం ఎల్ సి వున్నారు. 
ఈ విషయాన్ని తెలంగాణ సి ఎం ఓ తమ ఆఫిషి యల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు
పూర్త్తి సమాచారం కొరకు సోర్స్ చుడండి