తెలంగాణ రాష్ట్రము లో గుడిలలో పూజా కార్యక్రమాలు నిర్వహించే పూజారులకు ప్రభుత్వ వేతనాలు

తెలంగాణ రాష్ట్రము లో గుడిలలో పూజా  కార్యక్రమాలు  నిర్వహించే  పూజారులకు ప్రభుత్వ వేతనాలు ఖరారు 
తెలంగాణ రాష్ట్రములోని దేవాదాయ శాఖ పరిధిలో వున్న ప్రతి దేవాలయములో పూజ కార్యక్రమాలు చేస్తున్న అర్చకులకు నేరుగా వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వం నిర్ణయించింది  ఇక నుండి అర్చకులకు
ప్రభుత్వ  ఉద్యోగు ల లాగే నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి వారికి  వేతనాలు చెల్లిస్తామని సి ఎం కే సి ఆర్ గారు ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుండే ఈ విధానము అమల్లోకి వస్తుందని అయన అన్నారు.  అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు సవరించినప్పుడు వారితో పాటు పూజారుల వేతనాలు కూడా సవరిస్తామని తెలియజేశారు.
అంతే కాకుండా పూజారుల పదవి విరమణ వయసును ఇప్పుడున్న 58 ఏండ్లను సవరించి 65 ఏండ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
అర్చకుల జీతాల చెల్లింపులకు సంబందించిన మరియు అర్చకుల పదవి విరమణ వయో పరిమితి పెంపుదలకు సంబందించిన విధి విధానాలు ఖరారు చేసి సోమవారం రోజున అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలనీ ముఖ్యమంత్రి గారు అధికారులను  ఆదేశించడం జరిగింది.
పూర్తి వివరాలకు సోర్స్ చుడండి 

0 comments:

Post a Comment