UAE లో మీ ATM కార్డు బ్లాక్ కావడం గురించి ఒక సందేశం వచ్చిందా? ఇది చదవండి/did you get message that your ATM card blocked

UAE లో మీ ATM కార్డు బ్లాక్ కావడం గురించి ఒక సందేశం వచ్చిందా? ఇది చదవండి
దుబాయ్  దేశపు పోలీసులు స్థానిక వార్త పత్రిక కలిజ్ టైమ్స్ లో  వార్నింగ్ జారీ చేశారు. 
దుబాయ్ లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన  మరో స్కాం సందేశం బయటకు వచ్చింది.  
ఇటవల  దుబాయిలో ని పుజారా  లో  కొత్తగా ఒక ఎటిఎం కార్డు బ్లాక్ అనే మెస్సేజ్ స్కాం గురించి పోలీసులు  వివరాలు తెలిపారు. 
మొబైల్ ఫోన్ యూజర్లందరికీ తమ సోషల్మీడియా  అకౌంట్స్  ను జాగ్రత్త గ వాడుకోవాలని హెచ్చరిక జారీ చేశారు. 
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సందేశం లో ఈ విధంగా మెసేజ్ వున్నది " ప్రియమైన ఖాతాదారుడా! కొత్త సంవత్సరం 2019 లో మీ ఎటిఎం కార్డు వివరాలు ఇంకా అప్ డేట్ చేయనందున మీ ATM కార్డ్ బ్లాక్ చేయబడుతుంది. " 
"మీరు మీ ATM కార్డ్ సరిగా పని చేయాలనుకుంటే, మీరు ఈ  క్రింది నంబర్స్: 0589065238, లేదా 0522633476 సంప్రదించండి."  అని మెసేజ్  వాట్స్ అప్  ద్వారా పంపుతున్నారు. 
ఇది ఫేక్ మెసేజ్ దీ నిని ఎవరు నమ్మవద్దు అని దుబాయ్ పోలోసులు ఒక  ప్రకటన చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి మెసేజ్ వాట్స్ అఫ్ ద్వారా కానీ లేదా ఎస్ ఎం ఎస్ ద్వారా కానీ వచ్చిన ఎవ్వరు నమ్మవద్దు, ఆ నంబర్లకి కాల్ కూడా చేయ వద్దు. 
కాల్ చేస్తే మాత్రం వాళ్ళు మిమ్మల్ని కచ్చితంగా వారి మాటలతో మీ బ్రెయిన్ వాష్ చేసి మిమ్మల్ని హిప్నటైజ్  చేసి వాళ్ళ మాటలను నమ్మే టట్లు చేస్తారు . 
ఈ విషయం మీ స్నేహితులందరికీ చెప్పండి జాగ్రతః గ వుండండి 
ఇటువంటి మెసేజ్ వస్తే గనుక మీరు నేరుగా మీ బ్యాంకు కు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకోండి . ఈ సందేశం WhatsApp ద్వారా పంపబడుతున్నాయని స్పష్టంగాతెలుస్తుంది.  వాట్స్ అప్ లో వచ్చిన మెసేజ్ ను ఫుజిరా పోలీసులు వాళ్ళ ఆఫీసియల్  ట్విట్టర్ ఖాతా  లో పోస్ట్ చేసినారు, ఆ మెసేజ్ ను కింద చూడవచ్చు 


0 comments:

Post a Comment