Gulf NRI Policy for Telangana people ఎన్ ఆర్ ఐ పాలసీ కోసం

గల్ఫ్ లో వున్న తెలంగాణ ప్రజలకొరకు గల్ఫ్   ఎన్  ఆర్  ఐ  పాలసీ తీసుకు రావాలనే గత కొంత కాలంగా చాల మంది చాల రకంగా ఉద్యమాలు చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం పై ఒతీ డి  తీవ్రతరమైనప్పిటికి తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాల విచారకరం.
గల్ఫ్ దేశాలలో వున్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా తమ విన్నపాన్ని తమ పోరాటాన్ని తెలిపి తెలంగాణ ప్రభుత్వంలో మార్పు తేవాలని మన గల్ఫ్ తెలంగాణ వాసుల పోరాటం గెలిచే వరకు అందరు గల్ఫ్ లో మరియు మన దేశం లో కూడా అందరు రాజకీయ నాయకులూ పార్టీలకతీతంగా మా కుటుంబ సభ్యలకు అండగా పోరాడగలరని అందరికి పాదాభివందనం.
ఇందులో భాగంగానే గత కొంత కాలంగా పోరాటాన్ని చేస్తున్న దుబాయిలోని గల్ఫ్ కార్మికుల అవగాహనా వేదిక వారు ఈ రోజు కొందరు గౌరవ సభ్యులతో సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు వెలువడించారని తమ అధికారిక పేస్ బుక్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది
ఆ వివరాలు ఇలా వున్నాయి

  • ఆమ్నెస్టీ లో ఎవరైతే ఇక్కడ దుర్భర జీవితం గడుపుతున్నారో వాళ్లకు పూర్తి అవగాహన కల్పించి అన్నివిధాలా సహకరించి వారిని క్షేమంగా ఇంటికి చేరాలా చేయడం 
  • యితర అన్ని గల్ఫ్ దేశాలలో వున్నా మన తేలంగాణ వారి మంచి భవిషత్తు కొరకు ఎన్  ఆర్ ఐ పాలసీని తొందరగా తీసుకురావడానికి ఉద్యమాన్ని బలోపేతం చేయడం 
  • గల్ఫ్ లో వున్న మన అన్నల సహాయ సహకారాలతో ఉద్యమాన్ని ఉదృతం చేయడం తో పా టు  మన దేశం లో వున్నా వారి కుటుంబ సభ్యులకు ఎం ఆర్ ఐ పాలసీ గురించి అవగాహనా కల్పించి ప్రభుత్వం పై ఒత్తిడి చేపట్టి మన గల్ఫ్ కుటుంబాలకు ఆదు కొనే  భరోసా కల్పించే ఈ ఎం ఆర్ ఐ పాలసీని ఇచ్చేదాకా ఉద్యమం చేయడం 
  • ఎం ఆర్ ఐ పాలసీ ఉద్యమంలో మొదటి నుండి చురుగ్గా పాల్గొన్న కొందరు కొన్ని కారణాల వలన ఇప్పుడు రాలేక పోతున్న వారిని విస్మరించరాదని అలాగే ప్రస్తుతం ముందుకు వచ్చిన వారిని ప్రోత్సహిస్తూ కలుపుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయిన్చారు అలాగే నేను సైతం అని వుత్సాహంగా పోరాడడానికి ఎంత మంది వచ్చిన  వారిని కలుపుకొని గల్ఫ్ కార్మికుల అవగాహనా వేదిక ను ఇంకా బలోపేతం చేయాలనీ నిర్ణఇంచారు 
  • అంతే కాకుండా వచ్చే నెల సెప్టెంబర్ లో ఎంతెలంగాణ ప్రభుత్వానికి మన విన్నపం ఏదైతే ఎన్  ఆర్ ఐ పాలసీ ఇవ్వాలని ఉద్యమం చేస్తున్నామో అది ఉదృత చేస్తూ మన సత్తా చాటడానికి కొన్ని వేళ మంది కార్మికుల తో, ప్రముఖులతో మరియు కళాకారులతో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని (తెలంగాణ ఎన్  ఆర్ ఐ పాలసీ ధూమ్ ధామ్ )చేయడానికి  సన్నాహాలు చేపట్టినట్లు తెలిపారు 
  • ఈ కార్యక్రమానికి సంబందించిన పూర్తి సమాచారం త్వరలో తెలియచేస్తామని  దుబాయ్ లో వున్నా అందరు వీలైన ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయ గలరు 
  • మరింత సమాచారం కొరకు https://www.facebook.com/GWACUAE/     
  • అలాగే దుబాయ్ ఆమ్నెష్టి  సందర్భంగా తెలుగు వాళ్లకు సహాయ సహకారాలు అందించడానికి హైదరాబాద్ నుండి మహా టీవీ ఛానల్ మూర్తి గారు కూడా వచ్చి సహాయం చేస్తున్నారు    ఎన్  ఆర్ ఐ పాలసీ పాటను ఇక్కడ విడుదల చేసినారు                                            

0 comments:

Post a Comment